Prakash Raj: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ను ఎల్లుండి హత్య చేయబోతున్నామంటూ బెదిరింపు లేఖ!

  • 29, బుధవారం ముహూర్తం
  • 13 మంది పేర్లతో లేఖ
  • తననూ బెదిరిస్తున్నారన్న కుమారస్వామి

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ను, ఈ నెల 29, బుధవారం నాడు హతమారుస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖను పంపారు. వీరి హిట్ లిస్టులో మాజీ సీఎం కుమారస్వామి, నిజాగుణానంద స్వామి తదితర 13 మంది పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. కన్నడలో ఉన్న ఈ లేఖలో ధర్మానికి, దేశానికి ద్రోహం చేస్తున్నవారిని హతమార్చేందుకు జనవరి 29ని ముహూర్తంగా నిర్ణయించుకున్నామని, అందరూ తమ అంతిమ ప్రయాణానికి సిద్ధం కావాలని అందులో ఉంది.

ఈ మేరకు నిజగుణానంద స్వామి మఠానికి పలువురి పేర్లతో కూడిన లేఖ రాగా, దాన్ని జిల్లా ఎస్పీకి ఆశ్రమ నిర్వాహకులు అందించారు. ఆశ్రమానికి అదనపు భద్రతను కల్పిస్తామని పోలీసులు చెప్పగా, నిజగుణానంద స్వామి తిరస్కరించారు. ఇక, తననూ హత్య చేస్తామని బెదిరింపులు వచ్చాయని కుమారస్వామి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

Prakash Raj
Kumaraswamy
Murder
Letter
Karnataka
  • Loading...

More Telugu News