Rahul Gandhi: పాప్యులారిటీలో సోనియా కంటే ముందున్న రాహుల్ గాంధీ!

  • ఐఏఎన్ఎస్ - సీ ఓటర్ రిపబ్లిక్ డే సర్వే
  • రాహుల్ కు 51.9 శాతం మంది మద్దతు
  • 543 నియోజకవర్గాల్లో సర్వే

దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉన్న పాప్యులారిటీ విషయంలో తన తల్లి కన్నా రాహుల్ గాంధీ ముందున్నారు. తాజాగా ఐఏఎన్ఎస్ - సీ ఓటర్ రిపబ్లిక్ డే 'స్టేట్ ఆఫ్ నేషన్' సర్వేను నిర్వహించగా, సోనియాగాంధీకి 49.5 శాతం మంది, రాహుల్ గాంధీకి 51.9 శాతం మంది మద్దతుగా నిలిచారు.

మొత్తం 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించామని తెలిపిన నిర్వాహకులు 30,240 మంది నుంచి అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పారు. హరియాణాలో రాహుల్ పనితీరుపట్ల కేవలం 17.7 శాతం మంది సంతృప్తిగా ఉండగా, కేరళలో 51.9 శాతం, పుదుచ్చేరిలో 76 శాతం రాహుల్ కు అనుకూలంగా ఉన్నారని సర్వే పేర్కొంది.

Rahul Gandhi
Sonia Gandhi
Survey
Popularity
  • Loading...

More Telugu News