Jagan: జగన్ పై వీరాభిమానం... కిలిమంజారో పర్వతంపై ఫొటో ప్రదర్శన!

  • 23న పర్వతాన్ని అధిరోహించిన శంకరయ్య
  •  'చిల్ట్రన్ స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా' తరఫున అధిరోహణ
  • వెంట డిగ్రీ విద్యార్థి ఈశ్వరయ్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తనకున్న అభిమానాన్ని గుంటూరు జిల్లాకు చెందిన 'చిల్ట్రన్ స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా' సభ్యుడు కె.శంకరయ్య వినూత్నంగా చాటుకున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పర్వతమైన కిలిమంజారోను అధిరోహించి, దానిపై జగన్ చిత్ర పటాన్ని ప్రదర్శించారు. శీలం ఈశ్వరయ్య అనే డిగ్రీ విద్యార్థితో కలిసి టాంజానియా చేరుకున్న శంకరయ్య, 23వ తేదీ ఉదయం 10 గంటలకు పర్వతాన్ని ఎక్కారని క్లబ్ ఓ ప్రకటనలో తెలిపింది. జాతీయ జెండాను సైతం శంకరయ్య ఎగురవేశారని, ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థలో స్పోర్ట్స్ కోచ్ గా పని చేస్తున్నారని పేర్కొంది.

Jagan
Kilimanjaro
Mount
Photo
  • Loading...

More Telugu News