Tiger: పులి చేత చిక్కి చచ్చి బతికాడు... వీడియో ఇదిగో!

  • మహారాష్ట్రలో ఘటన
  • గ్రామంలో ప్రవేశించిన పెద్దపులి
  • తరిమేందుకు ప్రయత్నించిన గ్రామస్తులు
  • ఓ వ్యక్తిని దొరకబుచ్చుకున్న పులి
  • చచ్చిన శవంలా యాక్ట్ చేసిన వ్యక్తి

ఇటీవల కాలంలో జనావాసాల్లోకి పులులు, ఇతర క్రూరమృగాలు వస్తుండడం పరిపాటిగా మారింది. మహారాష్ట్రలోని భందారా జిల్లాలో తుస్మార్ అనే గ్రామంలోకి పెద్దపులి ప్రవేశించింది. హడలిపోయిన గ్రామస్తులు దాన్ని అడవిలోకి తరిమేసేందుకు ప్రయత్నించారు. దాన్ని పొలాల మీదుగా అడవిలోకి మళ్లించే ప్రయత్నంలో ఓ వ్యక్తి పులికి దొరికిపోయాడు. అతడ్ని ఒడిసిపట్టుకున్న పులి చంపేందుకు ప్రయత్నించింది.

అయితే అంతటి విపత్కర పరిస్థితిలోనూ ఆ వ్యక్తి బుర్ర బాగా పనిచేసింది. వెంటనే చచ్చినశవంలా పడుకుండిపోయాడు. అతడిలో కదలిక లేకపోవడం గమనించిన పులి పంజాతో కొట్టి గాయపరిచే ప్రయత్నాన్ని విరమించుకుంది. ఇంతలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అతడ్ని వదిలేసి అడవిలోకి పరుగులు తీసింది. పులి వెళ్లిన మరుక్షణమే ఆ వ్యక్తి చెంగున లేచి ఇవతలికి వచ్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Tiger
Villager
Capture
Bhandara District
Tusmar Village
  • Error fetching data: Network response was not ok

More Telugu News