AP Bhavan: ఏపీ భవన్ లో 'ఐ లవ్ అమరావతి' బోర్డు తొలగింపు

  • బోర్డును తొలగించిన ఏపీ భవన్ సిబ్బంది
  • రాష్ట్ర విభజన తర్వాత అమరావతి బోర్డు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • రెసిడెంట్ కమిషనర్ ఆదేశాలతో బోర్డు తొలగింపు?

ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఉన్న ఐ లవ్ అమరావతి బోర్డును తొలగించారు. ఏపీ భవన్ సిబ్బంది బోర్డును తీసివేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం ఏపీ భవన్ లో అమరావతి బోర్డును ఏర్పాటు చేసింది. అయితే ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా ఆదేశాలతోనే బోర్డును తొలగించినట్టు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రాజధాని అమరావతి భవితవ్యంపై అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే.

AP Bhavan
Amaravati Board
New Delhi
Resident Commissioner
Bhavana Saxena
  • Loading...

More Telugu News