Muniandi Swamy Temple: ఈ ఆలయంలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలే ప్రసాదాలు.. ఇంటికి పార్శిల్ కూడా తీసుకెళ్లొచ్చు!

  • మధురై మునియాండి స్వామి ఆలయంలో బిర్యానీ ప్రసాదం
  • ఏడాదికి రెండ్రోజులు ఉత్సవాలు
  • వందల సంఖ్యలో మేకలు, కోళ్లతో బిర్యానీలు

తమిళనాడులో ఉన్నన్ని ఆలయాలు మరే రాష్ట్రంలో ఉండవంటే అతిశయోక్తి కాదు. అయితే, ఆ రాష్ట్రంలోని మధురై ప్రాంతంలో ఉన్న మునియాండి స్వామి ఆలయానికి మరెక్కడా లేనంత విశిష్టత ఉంది. ఎక్కడైనా ఆలయాల్లో ప్రసాదం అంటే పొంగలి, పులిహోర, వడపప్పు, కొబ్బరి ముక్కలు ఉంటాయి. కానీ, మునియాండి స్వామి ఆలయంలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలే ప్రసాదాలు. గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ఇక్కడ ఇదే ఆనవాయితీ.

ప్రతి సంవత్సరం ఇక్కడ జనవరి 24 నుంచి రెండ్రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు మునియాండి ఆలయానికి వస్తారు. వారి కోసం 1000 కిలోల బియ్యం, 250 మేకపోతులు, 300 కోళ్లతో రుచికరమైన బిర్యానీలు వండుతారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఇదే ప్రసాదంగా అందిస్తారు. అంతేకాదు, ఆ బిర్యానీ ప్రసాదాన్ని పార్శిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం కూడా ఉందిక్కడ!

  • Error fetching data: Network response was not ok

More Telugu News