Mahesh Babu: సినిమాలకు మహేశ్ బాబు తాత్కాలిక విరామం..?

  • మోకాలి గాయంతో బాధపడుతున్న మహేశ్ బాబు
  • ఆగడు షూటింగ్ లో గాయం
  • గాయం తిరగబెట్టిందని వార్తలు!

ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ఘనవిజయం అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందుకు కారణం మహేశ్ బాబు మోకాలి గాయంతో బాధపడుతుండడమేనని తెలుస్తోంది.

మహేశ్ కు ఆగడు సినిమా షూటింగ్ లో కాలికి గాయమైంది. అప్పట్లో సర్జరీ కూడా చేయించుకున్నారు. ఇటీవలే వేగంగా సినిమాలు పూర్తిచేస్తున్నందున గాయం మళ్లీ తిరగబెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించి అన్ని ఈవెంట్లు పూర్తికావడంతో అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకోవాలన్నది మహేశ్ బాబు ఆలోచన అని సన్నిహిత వర్గాలంటున్నాయి. మోకాలికి శస్త్రచికిత్స అంటే కొన్నినెలల పాటు విశ్రాంతి తప్పదు. దీనిపై మహేశ్ బాబు క్లారిటీ ఇస్తే మరిన్ని విషయాలు వెల్లడవుతాయి.

Mahesh Babu
Tollywood
Break
Injury
Surgery
USA
  • Loading...

More Telugu News