padma awards: ‘పద్మ’ అవార్డు విజేతలకు మంత్రి కేటీఆర్ అభినందనలు

  • ఫోన్ కాల్స్ చేసి అభినందించిన మంత్రి కేటీఆర్
  • సింధు, విజయసారథి, వెంకటరెడ్డికి అభినందనలు
  • ఆయా రంగాల్లో వారు చేసిన సేవలపై ప్రశంసలు

ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాలకు ఎంపికైన వారికి తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన పీవీ సింధు బ్యాడ్మింటన్ క్రీడకు తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్తు దేశానికి గొప్ప పేరు తెచ్చిందని ప్రశంసించారు. సింధుకు అవార్డు రావడం మరింత మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కరీంనగర్ కు చెందిన శ్రీభాష్యం విజయసారథికి, హైదరాబాద్ కు చెందిన చింతల వెంకటరెడ్డికి ఫోన్ లో అభినందనలు తెలిపారు. విజయసారథికి ఈ గౌరవం లభించడం ఆయన చేసిన సాహిత్య కృషికి దక్కిన గుర్తింపుగా అభివర్ణించారు. ద్రాక్ష పంట సాగులో వినూత్నమైన మెలకువలతో, అద్భుతమైన వ్యవసాయ విధానాలతో గొప్ప దిగుబడులు సాధించిన వ్యక్తి వెంకట్ రెడ్డి అని కొనియాడారు. 

padma awards
KTR
PV Sindhu
padma bhushan
  • Loading...

More Telugu News