Budda Venkanna: నాన్నా, శాసనమండలి అవసరమా? అని జగన్ తన తండ్రి వైఎస్సార్ ను అడగాల్సింది: బుద్దా వెంకన్న

  • బుద్దా వెంకన్న మీడియా సమావేశం
  • జగన్ పై వ్యాఖ్యలు
  • పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలతో రాజీనామా చేయించాలని డిమాండ్

శాసనమండలి అవసరమా అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించడంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఘాటుగా స్పందించారు. సీఎం జగన్ ఒక ఉద్రేక స్వభావంతో ఆ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. గతంలో శాసనమండలిని పునరుద్ధరించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని, మరి శాసనమండలి అవసరమా అని జగన్ అప్పుడే తన తండ్రిని అడిగి ఉండాల్సిందని అన్నారు. మండలి నుంచి మంత్రులుగా నియమితులైన పిల్లి సుభాష్ చంద్రబోస్, జగన్ జైల్ మేట్ మోపిదేవి వెంకటరమణ మొదట తమ పదవులకు రాజీనామా చేయాలని, ఆ తర్వాతే మండలిలో చర్చ మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ శాసనమండలి రద్దు చేస్తే పదవులు పోతాయని టీడీపీ నేతలెవరూ భయపడరని స్పష్టం చేశారు.

Budda Venkanna
Jagan
YSR
AP Legislative Council
  • Loading...

More Telugu News