VH: అంబేద్కర్ విగ్రహం తెచ్చివ్వకపోతే ఆత్మార్పణ చేసుకుంటా: వీహెచ్

  • అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసి అవమానించారన్న వీహెచ్
  • ఇదేంటని ప్రశ్నిస్తే తనపై కేసులు పెట్టారని వెల్లడి
  • ఫిబ్రవరి 5 లోపు విగ్రహం తెచ్చివ్వాలని డిమాండ్

గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసి చెత్తకుప్పలో పారేశారని, ఇవాళ 71వ రిపబ్లిక్ డే నాడు ఆ విగ్రహం పోలీస్ స్టేషన్ లో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేసిన చోటే సొంత ఖర్చులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తాను ప్రయత్నిస్తే అడ్డుకున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే తనపై కేసులు పెట్టారని వీహెచ్ ఆరోపించారు. రాజ్యాంగం రూపొందించిన వ్యక్తికి గణతంత్ర దినోత్సవం నాడు ఇంత అవమానం జరుగుతుంటే ఎవరూ మాట్లాడడంలేదని, పోలీస్ స్టేషన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఫిబ్రవరి 5 లోపు తెచ్చివ్వకపోతే ఆత్మార్పణ చేసుకుంటానని స్పష్టం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు.

VH
Ambedkar
Statue
Hyderabad
Police Station
TRS
  • Loading...

More Telugu News