Digvijay Singh: మోదీ కంటే ఈయన ఒకడుగు ముందే ఉన్నారు: దిగ్విజయ్ సింగ్

  • ధరించే దుస్తులు బట్టి ముస్లిమా, కాదా అనేది చెప్పొచ్చన్న మోదీ!
  • పోహా వంటకం తినే విధానంతో పౌరసత్వం తెలుసుకోవచ్చన్న బీజేపీ నేత
  • స్పందించిన దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సీఏఏ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధరించే దుస్తులను బట్టి వారు ముస్లిమా, హిందువా అనే విషయం చెప్పగలనని ప్రధాని మోదీ అంటున్నారని, బీజేపీ నేత కైలాస్ విజయ వర్గీయ ప్రధానికంటే ఓ అడుగు ముందే ఉన్నారని వ్యాఖ్యానించారు. పోహా వంటకం తినే విధానాన్ని బట్టి వారి పౌరసత్వం గురించి చెబుతానని కైలాస్ విజయ వర్గీయ అంటున్నారని పేర్కొన్నారు.

భోపాల్ లో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ ఇవాళ మన మధ్య ఉంటే సీఏఏకి వ్యతిరేకంగా తప్పకుండా ఉద్యమించే వారని వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం వద్దంటూ షహీన్ బాగ్ లో నిరాహారదీక్షకు దిగేవారని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుపైనా ఢిల్లీ నుంచి జమ్మూకశ్మీర్ వరకు పాదయాత్ర చేసేవారని తెలిపారు.

Digvijay Singh
Narendra Modi
Kailas Vijaya Vargeeya
CAA
BJP
Congress
  • Loading...

More Telugu News