KCR: సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన బీజేపీ ఎంపీ అరవింద్

  • సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తానన్న కేసీఆర్ పై ఫైర్
  • కేసీఆర్ కు దమ్ముంటే సీఏఏను అమలు కాకుండా ఆపాలి
  • అప్పుడు ఏ గతిపడుతుందో.. అంటూ అరవింద్ ఆగ్రహం

తెలంగాణ సీఎం కేసీఆర్ కు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను తాము వ్యతిరేకిస్తున్నామని, త్వరలోనే అసెంబ్లీలో తీర్మానం చేస్తామని నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అరవింద్ మండిపడ్డారు. కేసీఆర్ కు దమ్మూధైర్యం ఉంటే సీఏఏను అమలు కాకుండా ఆపి చూడాలని, అప్పుడు కేసీఆర్ కు ఏ గతి పడుతుందో.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నది తప్పుడు నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ఓటు బ్యాంకు రాజకీయాలతోనే కాంగ్రెస్ పార్టీ పతనమైందని, అదే గతి టీఆర్ఎస్ కు పడుతుందని విమర్శించిన అరవింద్, తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని ధీమా వ్యక్తం చేశారు. 

KCR
TRS
BJP
Aravind
Mp
CAA
  • Loading...

More Telugu News