Telugudesam: రేపటి అసెంబ్లీ సమావేశానికి దూరంగా ఉండాలని టీడీఎల్పీ నిర్ణయం

  • వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది
  • కౌన్సిల్ ని రద్దు చేసే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదు
  • మండలి గురించి అసెంబ్లీలో చర్చించకూడదు: బచ్చుల అర్జునుడు

శాసనమండలిలో తమ దెబ్బకు జగన్ దిమ్మ తిరిగిందని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, శాసనమండలిని రద్దు చేసే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని, కేవలం తీర్మానం మాత్రమే చేయగలరని అన్నారు.

శాసనమండలిలో జరిగిన పరిణామాలు, మండలి రద్దు అంశంపై రేపు అసెంబ్లీలో చర్చిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, మండలి గురించి అసెంబ్లీలో చర్చించకూడదని అన్నారు. రేపటి అసెంబ్లీ సమావేశానికి హాజరుకాకూడదదని టీడీఎల్పీ నిర్ణయించినట్టు చెప్పారు.

Telugudesam
TDLP
Meeting
Batchula Arjunadu
  • Loading...

More Telugu News