Telugudesam: అమరావతిలో ఏపీ టీడీఎల్పీ సమావేశం ప్రారంభం

  • చంద్రబాబునాయుడు అధ్యక్షతన సమావేశం 
  • హాజరైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
  • ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు గైర్హాజరు

ఏపీ టీడీఎల్పీ సమావేశం అమరావతిలో ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. శాసనమండలి రద్దు వార్తలపై చర్చ, సభలో తమ సభ్యులు ఎలా వ్యవహరించాలనే దానిపై వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు తాము హాజరుకావట్లేదని ముందుగానే పార్టీ అధిష్టానానికి సమాచారం ఇచ్చారు. వ్యక్తిగత కారణల రీత్యా హాజరుకాలేకపోతున్నట్టు గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల, రామకృష్ణలు తెలియజేశారు.

Telugudesam
Chandrababu
TDLP
Amaravati
  • Loading...

More Telugu News