BJP: అందుకే మా పార్టీ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించింది: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

  • మతం రంగుపులిమి ఓ వర్గ ప్రజలను బీజేపీ అణచివేస్తోంది
  • ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ మాత్రమే
  • మున్సిపల్ పోల్స్‌లో మా ఓటింగ్ శాతం పెరిగింది
  • 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం  

ఓ వర్గం ప్రజలను కేంద్ర ప్రభుత్వం తక్కువగా చూస్తోందని, మతం రంగుపులిమి అణచివేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...  ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే తమ పార్టీ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిందని చెప్పారు.

సీఏఏ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ నాటకాలు ఆడుతున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దేశ ప్రజలంతా రాజ్యాంగాన్ని గౌరవించాలని, మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాలు ప్రజలకు స్వేచ్ఛనివ్వడంలేదని అన్నారు. మున్సిపల్ పోల్స్‌లో తమ పార్టీ ఓటింగ్ శాతం పెరిగిందని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన అన్నారు. ప్రజల ఉద్యమాలను కేసీఆర్ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని, ప్రతిపక్ష నేతలను బెదిరించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని అన్నారు.

BJP
TRS
Congress
Uttam Kumar Reddy
  • Loading...

More Telugu News