Kishan Reddy: సీఏఏలో ప్రజలకు నష్టం జరిగే అంశాలు ఏమిటో కేసీఆర్ చెప్పాలి : కిషన్ రెడ్డి

  • ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ కుహనా రాజకీయాలు 
  • పదిహేను నిమిషాల్లో హిందువులను ఖతం చేస్తామన్న ఎంఐఎం మాటలు మర్చిపోయారా?
  •  మీకు హిందువుల గురించి మాట్లాడే అర్హత లేదన్న కేంద్రమంత్రి

కేంద్రం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, చట్టంలో ప్రజలకు నష్టం కలిగించే అంశాలేమిటో ముందు ఆయన చెప్పి తర్వాత విమర్శలు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సీఏఏ పై తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. పదిహేను నిమిషాల సమయం ఇస్తే హిందువులందరినీ ఖతం చేస్తామన్న ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని కుహనా రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ కు హిందువుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాకుండా అడ్డుకున్న పార్టీ ఎంఐఎం అని, అటువంటి పార్టీతో అంటకాగుతున్న కేసీఆర్ హిందువుల గురించి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని చురకంటించారు.

Kishan Reddy
CAA
KCR
MIM
  • Loading...

More Telugu News