YSRCP: శాసన మండలి రద్దు చెయ్యాలని జగన్ అనుకోవడంలో విచిత్రం ఏముంది?: బుద్ధా వెంకన్న

  • తండ్రి శవం దొరకక ముందే సీఎం అయిపోవాలని సంతకాలు సేకరించాడు
  • కౌన్సిల్ వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది అని సొల్లు కబుర్లు ఎందుకు? 
  • జగన్ తీసుకుంటున్న చెత్త నిర్ణయాలకు అడ్డుగా ఉంది 
  • అందుకే రద్దు చేస్తున్నానని ప్రకటించే దమ్ము జగన్‌కు లేదా?

శాసన మండలి రద్దు ప్రతిపాదనలపై టీడీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆయన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.
 
'1200 కోట్ల రూపాయలతో పంచాయతీ భవనాలకు, శ్మశానాలకు రంగులు వేశారు. 20 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఇల్లుని మళ్లీ కట్టారు. ఇప్పుడు మండలి ఖర్చు భారం అవుతుంది అంటూ జగన్ గారి మొసలి కన్నీరు ఎందుకు విజయసాయిరెడ్డి గారు?' అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.
 
'తాను తీసుకుంటున్న చెత్త నిర్ణయాలకు అడ్డుగా ఉంది అందుకే రద్దు చేస్తున్నా అని ప్రకటించే దమ్ము లేదా? మాట మార్చే, మడమ తిప్పే బ్రతుకు ఎలా మారుతుంది? 4 లక్షల మంది వైకాపా కార్యకర్తలకు గ్రామ వాలంటీర్ల పేరుతో 12 వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు' అని ఆరోపించారు.
 
'తండ్రి శవం దొరకక ముందే ముఖ్యమంత్రి అయిపోవాలని సంతకాలు సేకరించినవాడు తండ్రి తీసుకొచ్చిన మండలి రద్దు చెయ్యాలి అనుకోవడంలో విచిత్రం ఏమి ఉంది? కౌన్సిల్ వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది అని సొల్లు కబుర్లు ఎందుకు?' అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.

YSRCP
Telugudesam
Vijay Sai Reddy
budda venkanna
  • Loading...

More Telugu News