Yanamala: ఎన్టీఆర్‌కు వెన్ను పొడిచి అకాల మరణానికి కారకుడైన వారిలో రెండో దోషి ఆయనే: విజయసాయిరెడ్డి

  • యనమల రామకృష్ణుడిపై విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు
  • పెద్దాయన ఉసురు తగిలింది
  • తుని ప్రజలు తరిమికొట్టడంతో దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యాడు
  • ఆయనిప్పుడు నీతి చంద్రికలు చదువుతున్నాడు

టీడీపీ నేత యనమల రామకృష్ణుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ కు వెన్ను పొడిచి ఆయన అకాల మరణానికి కారకుడైన వారిలో చంద్రబాబు తర్వాత రెండో దోషి యనమల. పెద్దాయన ఉసురు తగిలి తుని ప్రజలు తరిమికొట్టడంతో దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యాడు. ఆయనిప్పుడు నీతి చంద్రికలు చదువుతూ పత్తి గింజలా ప్రగల్భాలు పలుకుతున్నాడు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
 
'అప్పట్లో కౌన్సిల్ ను పునరుద్ధరించాలని డా.వైఎస్సార్ ప్రతిపాదించినప్పుడు ఇదే చంద్రబాబు డబ్బులు దండగ అన్నాడు. సీఎం జగన్ గారు కౌన్సిల్ వల్ల ఖర్చు తప్ప ప్రయోజనం లేదనగానే, మీరు రద్దు చేస్తే నేనొచ్చాక మళ్లీ తెస్తా అని బట్టలు చించుకుంటున్నాడు. విజనరీది మాట మీద నిలకడ లేని బతుకు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 

Yanamala
Chandrababu
YSRCP
Vijay Sai Reddy
  • Loading...

More Telugu News