Chandrababu: సోమిరెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించిన చంద్రబాబు!

  • ఇటీవల ఆనారోగ్యం బారినపడ్డ సోమిరెడ్డి
  • హైదరాబాద్ లోని ఇంట్లో ప్రస్తుతం విశ్రాంతి
  • గల్లా జయదేవ్ తో పాటు వచ్చిన చంద్రబాబు

ఆంధ్రపదేశ్ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోమిరెడ్డి, కొన్ని రోజులు ఆసుపత్రిలో అడ్మిట్ అయి, ఇటీవలే డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోమిరెడ్డి, హైదరాబాద్ లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, ఇతర నేతలతో కలిసి సోమిరెడ్డి ఇంటికి వచ్చిన చంద్రబాబు, ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

Chandrababu
Galla Jayadev
Somireddy Chandra Mohan Reddy
  • Loading...

More Telugu News