Tollywood: నాకు ఈ రోజు ఎప్పటికీ గుర్తుండి పోతుంది: మహేశ్ బాబు భావోద్వేగం

  • జవాన్లను కలిసిన ఫొటోలను షేర్ చేసిన మహేశ్ బాబు
  • మనల్ని ప్రతిరోజు కాపాడుతోన్న భారత హీరోలకు సెల్యూట్ 
  • గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 

ధైర్య, సాహసాలతో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సినీనటుడు మహేశ్ బాబు అన్నారు. తాజాగా, జవాన్లతో కలిసినప్పుడు తీసుకున్న ఫొటోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుల్లో ఈ రోజు కూడా నిస్సందేహంగా ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పారు. మనల్ని ప్రతిరోజు కాపాడుతోన్న భారత హీరోలకు (జవాన్లకు) సెల్యూట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
               
కాగా, సరిలేరు నీకెవ్వరు సినిమా బృందంతో కలిసి మహేశ్ బాబు జవాన్లను కలిశారు. నటి విజయ శాంతి, దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఆయనతో ఉన్నారు. ఇటీవల విడుదలైన సరిలేరు నికెవ్వరు సినిమాలో మహేశ్ జవానుగా కనపడిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.         

Tollywood
vijaya shanti
Mahesh Babu
SarileruNeekevvaru
  • Loading...

More Telugu News