Karan Johar: ఇప్పుడు మా నాన్న ఉండి ఉంటే చాలా సంతోషించే వారు: కరణ్ జొహార్‌

  • కరణ్‌ జొహార్‌కు పదశ్రీ పురస్కారం 
  • ప‌ద్మ‌శ్రీ తనకు దక్కడం పట్ల గ‌ర్వంగా ఉందన్న కరణ్ 
  • తన లోని భావాలు పంచుకోవడానికి మాట‌లు రావ‌డం లేదని పోస్ట్

ప్రముఖ నిర్మాత, రచయిత, దర్శకుడు, నటుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకుంటోన్న కరణ్‌ జొహార్‌ను పదశ్రీ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో అత్యున్న‌త పౌర‌ పుర‌స్కారాల్లో ఒక‌టైన ప‌ద్మ‌శ్రీ తనకు దక్కడం పట్ల గ‌ర్వంగా ఉందని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ సమయంలో తన లోని భావాలు పంచుకోవడానికి మాట‌లు రావ‌డం లేదని ఆయన చెప్పారు. ఇప్పుడు తన తండ్రి ఉండి ఉంటే చాలా సంతోషించే వార‌ని ఆయన చెప్పారు.

కాగా, ఈ ఏడాది ఏడుగురికి పద్మ విభూషణ్‌, 16 మందికి పద్మభూషణ్‌, 118 మందికి పద్మశ్రీ  దక్కింది. బాలీవుడ్‌ ప్రముఖుల్లో పద్మశ్రీ అందుకున్న వారిలో కరణ్‌ జొహార్‌తో పాటు ఏక్తా కపూర్‌, కంగనా రనౌత్‌, అద్నాన్‌ సమీలు ఉన్నారు.

Karan Johar
Bollywood
padma awards
  • Loading...

More Telugu News