Anil Kumar Poluboina: ఏం సాధించారని పూలు చల్లించుకుంటూ, ఊరేగింపులు చేయించుకుంటున్నారు?: టీడీపీ నేతలపై మంత్రి అనిల్ ధ్వజం

  • సంఖ్యాబలం ఉందని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవద్దంటూ హితవు
  • చంద్రబాబు ఒత్తిడి మేరకే చైర్మన్ వ్యవహరించారని ఆరోపణ
  • సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలని ఆగ్రహం

ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మండలిలో సంఖ్యాబలం ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తే సరిపోదని మండిపడ్డారు. చంద్రబాబు ఒత్తిడి మేరకే చైర్మన్ వ్యవహరించారని ఆరోపించారు. ఆ మాత్రానికే ఏదో సాధించామంటూ పూలు చల్లించుకుంటూ, ఊరేగింపులు చేయించుకుంటున్నారని విమర్శించారు. పైగా పాలాభిషేకాలు కూడా చేయించుకుంటున్నారని, సంబరాలు చేసుకోవడానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి టీడీపీ నేతలు సహకరించకపోయినా ఫర్వాలేదు కానీ, అడ్డుకోవద్దని అనిల్ హితవు పలికారు.

ప్రభుత్వం తరఫున దావోస్ కు ఎవరూ వెళ్లలేదని విమర్శిస్తున్నారని, అనేక దేశాలు తిరిగిన చంద్రబాబు ఏం తీసుకువచ్చారని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇక్కడ కూర్చునే ప్రపంచాన్నంతా ఏపీకి తీసుకువస్తున్నారని తెలిపారు. అతి తక్కువ కాలంలోనే సీఎం జగన్ ఇండియాలో బెస్ట్ సీఎంగా నాలుగో స్థానంలో నిలిచారని పేర్కొన్నారు.

Anil Kumar Poluboina
Telugudesam
Chandrababu
Jagan
AP Legislative Council
  • Loading...

More Telugu News