MLA: బీజేపీతో కలిసి పవన్‌ కల్యాణ్‌ నిర్వహించేది లాంగ్ మార్చ్ కాదు.. ‘రాంగ్ మార్చ్’: ఎమ్మెల్యే అమర్ నాథ్

  • ముగ్గురు భార్యలుంటే తప్పు..కానీ మూడు రాజధానులుంటే తప్పేంటి?
  • పవన్ కు ఓ సిద్ధాంతం.. విధానం లేవు
  • చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగిలిపోతారు

బీజేపీతో కలిసి పవన్‌కల్యాణ్‌ నిర్వహించేది లాంగ్‌ మార్చ్‌ కాదు, రాంగ్‌ మార్చ్‌ అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై  వైసీపీకి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. పవన్ కు నిలకడ లేదు.. ఒక సిద్ధాంతం, విధానం కూడా లేవంటూ.. మాట మార్చడంలో ఆయనకు చంద్రబాబు ఆదర్శమంటూ ధ్వజమెత్తారు.

విశాఖలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి ముగ్గురు పెళ్లాలుంటే తప్పు గానీ... రాష్ట్రానికి మూడు రాజధానులు వుంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. పవన్‌కు వ్యక్తిగత జీవితంలో గ్యాప్‌ లేదు. అలాగే రాజకీయ జీవితంలో కూడా గ్యాప్‌ లేకుండా ఎవరినో ఒకరిని తోడు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విశాఖకు రాజధాని రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగిలిపోతారన్నారు.

MLA
Gudivade Amarnath
YSRCP
Criticism
Long March
Pawan Kalyan
Janasena
  • Loading...

More Telugu News