Ambati Rambabu: అభివృద్ధి నిరోధకమైన మండలిని రద్దు చేయాలన్నదే మా ఆలోచన: అంబటి రాంబాబు

  • మండలిలో వికేంద్రీకరణ బిల్లుకు చుక్కెదురు
  • బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు ప్రకటించిన చైర్మన్
  • మండలిని రద్దు చేసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ..?

ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో శాసనమండలి రద్దుకు వైసీపీ సర్కారు సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యలే అందుకు తాజా నిదర్శనం. వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను అసెంబ్లీ ఆమోదించగా, ఆపై మండలికి పంపితే అక్కడ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు చైర్మన్ షరీఫ్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఈ రోజు మాట్లాడుతూ, మండలిలో నిబంధనలు ఉల్లంఘించి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారని ఆరోపించారు. అభివృద్ధి నిరోధకమైన మండలిని రద్దు చేయాలన్నదే తమ ఆలోచన అని స్పష్టం చేశారు.

శాసనమండలిని నాడు వైఎస్సార్ పునరుద్ధరించినా, దాన్ని రద్దు చేయాలా? వద్దా? అనేది ప్రభుత్వ విచక్షణ అని తెలిపారు. వైఎస్సార్ గతంలో జాతీయ పార్టీలో ఉంటూ సీఎంగా పనిచేశారని, అందువల్ల అధిష్ఠానం ఒత్తిళ్లతో అప్పట్లో కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చని వివరించారు.

Ambati Rambabu
AP Legislative Council
Decentralization Bill
Shariff Mohammed Ahmed
YSRCP
Telugudesam
Amaravati
Andhra Pradesh
AP Capital
  • Loading...

More Telugu News