Revanth Reddy: పోలీసులపై నేరుగా ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

  • మహిళా కౌన్సిలర్ ను టీఆర్ఎస్ క్యాంపునకు తరలించారంటూ ఆరోపణ
  • పోలీసుల తీరుపై ఆగ్రహం
  • పోలీసులపై ఈసీకి ఫిర్యాదు

తెలంగాణ పోలీసుల తీరుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కోస్గి పట్టణంలో తమ శిబిరంలో ఉన్న 16వ వార్డు కౌన్సిలర్ ఎల్లమ్మను పోలీసులే బలవంతంగా టీఆర్ఎస్ క్యాంపునకు తరలించారని ఆరోపించారు. ఈ మేరకు నారాయణపేట జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరును ఖండిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు పోలీసుల వ్యవహార సరళిపై ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Revanth Reddy
Police
SP
Kosgi
EC
Telangana
TRS
Municipal Elections
  • Loading...

More Telugu News