Vijaya Ranga Raju: మోహన్ లాల్ వల్లనే నాకు అవకాశాలు పోయాయని తెలిసి బాధపడ్డాను: నటుడు విజయరంగరాజు

  • 'వియత్నం కాలని' మంచి పేరు తెచ్చిపెట్టింది
  • నిర్మాతలతో మోహన్ లాల్ అలా అన్నారట  
  • దర్శకుడు సిద్ధిక్ ద్వారా విషయం తెలిసింది 

తెలుగులో ప్రతినాయక పాత్రల ద్వారా విజయరంగరాజు చాలా పాప్యులర్ అయ్యారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మలయాళ సినిమాల్లో తనకి అవకాశాలు తగ్గిపోవడానికి గల కారణాన్ని గురించి వివరించారు. "మోహన్ లాల్ కథానాయకుడిగా .. నేను ప్రతినాయకుడిగా 'వియత్నం కాలని' సినిమా చేశాము. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్రకంటే నా పాత్రకి ఎక్కువ గుర్తింపు వచ్చేసింది. ఆ తరువాత నాకు మలయాళంలో అవకాశాలు రాలేదు.

చాలాకాలం తరువాత నాకు దర్శకుడు సిద్ధిక్ గారు తారసపడ్డారు. నాకు మలయాళంలో అవకాశాలు రాకపోవడానికి మోహన్ లాల్ కారకులని చెప్పారు. నా కాంబినేషన్లో చేయనని నిర్మాతలకి మోహన్ లాల్ చెప్పడం వల్లనే వాళ్లు తనని పక్కన పెట్టేశారని అన్నారు. చాలా అవకాశాలు .. వాటివలన రావలసిన డబ్బులు పోవడంతో చాలా బాధపడ్డాను" అని చెప్పుకొచ్చారు.

Vijaya Ranga Raju
Mohanlal
Vietnam Colony Movie
  • Loading...

More Telugu News