TRS: కేటీఆర్ కు సొంత నియోజకవర్గంలో షాక్ ఇచ్చిన రెబల్స్

  • సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించి 39 వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తి
  • 24 వార్డులను కైవసం చేసుకున్న టీఆర్ఎస్
  • 10 వార్డుల్లో జయకేతనం ఎగురవేసిన రెబల్స్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. మెజర్టీ స్థానాలను కైవసం చేసుకుంటూ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలబడింది. అయితే, కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో మాత్రం ఆ పార్టీకి కాస్త ఇబ్బందికర ఫలితాలు వెలువడ్డాయి.

సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించి 39 వార్డులకు ఓట్ల లెక్కింపు పూర్తి కాగా... అందులో టీఆర్ఎస్ 24 వార్డులు, బీజేపీ 3, కాంగ్రెస్ 2 వార్డుల్లో గెలిచాయి. 10 స్థానాల్లో టీఆర్ఎస్ రెబల్స్ విజయబావుటా ఎగరేశారు. రెబల్స్ ను బుజ్జగించేందుకు ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేసింది. అయినా వారు మాట వినలేదు. రెబల్స్ గా గెలిచినా వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోవడం ఉండదని గతంలోనే కేటీఆర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది.

TRS
Telangana Municipal Elections
Sircilla
Rebels
  • Loading...

More Telugu News