Jagan: జగన్ ను కలిసేందుకు ఐదు సార్లు యత్నించా!: సుమన్

  • మూడు రాజధానుల విషయంలో జగన్ ఉద్దేశం అర్థం కావడం లేదు
  • ఏం కావాలో రాజధాని రైతులు నిర్ణయించుకోవాలి
  • జగన్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ దొరకలేదు 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల విషయంలో జగన్ ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కావడం లేదని అన్నారు. అమరావతి ప్రాంత రైతులు వారికి ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలని చెప్పారు. రైతులకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

జగన్ ను కలిసేందుకు ఐదు సార్లు యత్నించానని... కానీ అపాయింట్ మెంట్ దొరకలేదని చెప్పారు. గుంటూరు జిల్లా మాచర్లలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

Jagan
Amaravati
YSRCP
Suman
Tollywood
  • Loading...

More Telugu News