Vijaya Rangaraju: 5 వేల సినిమాలు చేశాను .. ఆ ఒక్క సినిమా నాకు ప్రత్యేకం: నటుడు విజయరంగరాజు

  • తెలుగు సినిమాలంటే ఇష్టం 
  • మలయాళ సినిమా మంచి పేరు తెచ్చింది 
  • మోహన్ లాల్ ఆశ్చర్యపోయారన్న విజయరంగరాజు 

'భైరవద్వీపం' సినిమా ద్వారా తెలుగు తెరకి ప్రతినాయకుడిగా పరిచయమైన విజయరంగరాజు, తాజా ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించిన విషయాలను పంచుకున్నారు. "ఇంతవరకు నేను తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ .. పంజాబీ .. మరాఠీ .. ఒరియా .. ఇలా చాలా భాషల్లో నటించాను. 5 వేల సినిమాల వరకూ చేశాను.

ఇన్ని భాషల్లోను తెలుగులో చేస్తున్నప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. అయితే నాకు బాగా పేరు తెచ్చిన సినిమా మాత్రం మలయాళంలో వుంది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన 'వియత్నం కాలని' సినిమాలో నేను ప్రతినాయకుడిగా చేశాను. ఆ సినిమాలో విలన్ పాత్రకి మంచి ఆదరణ లభించింది. మోహన్ లాల్ పాత్రకంటే నా పాత్రకి ఎక్కువ గుర్తింపు వచ్చింది. నా పాత్ర కారణంగా ఆ సినిమా 250 రోజులు ఆడటం విశేషం. మోహన లాల్ సైతం ఆశ్చర్యపోయాడు" అని చెప్పుకొచ్చారు.

Vijaya Rangaraju
Mohanlal
Vietnam Volony Movie
  • Loading...

More Telugu News