Long March: బీజేపీ-జనసేన లాంగ్ మార్చ్ వాయిదా

  • ఇటీవలే చేతులు కలిపిన బీజేపీ, జనసేన
  • ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని పవన్ ప్రకటన
  • తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్న ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు 

ఇటీవలే ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి కోసం సంయుక్త పోరాటాలు చేయాలని రెండు పార్టీల నాయకత్వాలు నిశ్చయించాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని జనసేనాని పవన్ కల్యాణ్ దేశ రాజధానిలో ప్రకటించారు. అయితే ఇప్పుడా లాంగ్ మార్చ్ కార్యక్రమం వాయిదా పడింది. త్వరలోనే తాజా కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషణం తెలిపారు. లాంగ్ మార్చ్ ఎప్పుడు నిర్వహించేది తదుపరి నిర్ణయిస్తామని అన్నారు. 

Long March
Vijayawada
BJP
Janasena
Amaravati
Andhra Pradesh
AP Capital
  • Loading...

More Telugu News