Pawan Kalyan: పవన్ పై దుష్ప్రచారం... పరువునష్టం దావా వేయనున్న జనసేన

  • అమరావతిలో పవన్ కు 62 ఎకరాల భూములు ఉన్నాయని ప్రచారం
  • తీవ్రంగా పరిగణించిన జనసేన న్యాయవిభాగం
  • ఒకట్రెండు రోజుల్లో లీగల్ నోటీసులు పంపుతామని వెల్లడి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అమరావతి ప్రాంతంలో పవన్ కల్యాణ్ కు 62 ఎకరాల మేర భూములు ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని జనసేన వర్గాలు మండిపడ్డాయి. పవన్ పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, అలాంటివారిపై పరువునష్టం దావా వేస్తున్నామని జనసేన పార్టీ న్యాయవిభాగం వెల్లడించింది.

ఈ ప్రచారానికి కారకులైన వారికి లీగల్ నోటీసులు పంపుతామని జనసేన పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ సాంబశివ ప్రతాప్ ఓ ప్రకటనలో తెలిపారు. జనసేనను రాజకీయంగా ఎదుర్కోలేక, జనసేన సాగిస్తున్న ప్రజా పోరాటానికి కోట్లాది గొంతులు తోడుండడంతో ఎదురునిలిచి పోరాడలేని అల్పులే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Pawan Kalyan
Amaravati
Lands
Social Media
Janasena
Legal Notice
  • Loading...

More Telugu News