Naga Shaurya: నిజమే .. నాకు కొంచెం కోపం ఎక్కువే: హీరో నాగశౌర్య

  • నా సినిమా టీమ్ పై కోప్పడతాను 
  •  సినిమా ఆడితేనే కెరియర్ ఉంటుంది 
  •  అందరి గురించిన ఆలోచన చేస్తానన్న నాగశౌర్య

నాగశౌర్య ఇప్పుడు తన ఆశలన్నీ 'అశ్వద్ధామ' సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాకి తనే కథను సిద్ధం చేశాడు .. నిర్మాతగా పెద్దమొత్తమే ఖర్చు పెట్టాడు. అందువలన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకి కోపం ఎక్కువంటూ జరుగుతున్న ప్రచారాన్ని గురించి ప్రస్తావించాడు.

"నిజమే .. నాకు కొంచెం కోపం ఎక్కువే. నా దర్శకుడు .. రైటర్ .. కెమెరామెన్ ఇలా అందరిపై కోపంతో అరుస్తూనే వుంటాను. అవుట్ పుట్ అనుకున్నట్టుగా రావడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే నాకు కోపం వస్తుంది. సినిమా బాగా వస్తేనే .. బాగా ఆడితేనే అందరికీ లైఫ్ వుంటుంది. లేదంటే కెరియర్ పోతుంది .. అలా జరగకూడదనే ఉద్దేశంతోనే అవతల వాళ్లని అలర్ట్ చేస్తూ అరుస్తాను. అందరి కెరియర్ బాగుండాలనే అలా చేస్తాను తప్ప మరేమీ కాదు" అంటూ చెప్పుకొచ్చాడు.  

Naga Shaurya
Mehreen
Ashwathama Movie
  • Loading...

More Telugu News