KCR: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడనున్న సీఎం కేసీఆర్

  • కొనసాగుతున్న కౌంటింగ్
  • మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం
  • తెలంగాణ వ్యాప్తంగా కారు జోరు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కారు జోరు ప్రదర్శిస్తుండడంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ముందు వరకు టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమంటూ చెప్పుకొచ్చిన కాంగ్రెస్, బీజేపీలు ఫలితాల దగ్గరకు వచ్చేసరికి తీవ్ర నిరాశకు గురయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ హవానే అధికంగా వీచింది.

KCR
Municipal Elections
TRS
Telangana
Congress
BJP
  • Loading...

More Telugu News