Anil Ravipudi: కల్యాణ్ రామ్ రిస్క్ చేయడం వల్లనే నాకు తొలి హిట్ పడింది: అనిల్ రావిపూడి

  • 'పటాస్' కథ పట్టుకుని బాగా తిరిగాను 
  • అప్పటికి కల్యాణ్ రామ్ నష్టాల్లో వున్నారు 
  •  ఆయన వల్లనే ఇప్పుడిలా వున్నానన్న అనిల్ రావిపూడి

వరుస విజయాలతో దర్శకుడిగా అనిల్ రావిపూడి దూసుకుపోతున్నాడు. ఒక సినిమాను మించి మరో సినిమాను హిట్ చేస్తూ కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకి తొలిసారిగా అవకాశం ఇచ్చిన కల్యాణ్ రామ్ ను గురించి ప్రస్తావించాడు.

"నేను 'పటాస్' కథను సిద్ధం చేసుకుని హీరోలచుట్టూ .. నిర్మాతల చుట్టూ తిరుగుతున్నాను. కానీ ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను కల్యాణ్ రామ్ ను కలిశాను. తను హీరోగా చేయడానికి ఓకే అన్నారు. కానీ అప్పటికే నిర్మాతగా 'ఓమ్' సినిమాతో దెబ్బతిని ఉండటం వలన తన బ్యానర్లో చేయలేనని చెప్పారు. అప్పటి నుంచి ఇద్దరం కలిసి నిర్మాతల కోసం తిరిగాము .. ఎవరూ ముందుకురాలేదు. చివరికి కల్యాణ్ రామ్ రిస్క్ తీసుకుని తనే నిర్మించారు. ఆ రోజున ఆయన అలా చేయడం వల్లనే ఈ రోజున నేను ఈ పొజిషన్ లో వున్నాను" అని చెప్పుకొచ్చాడు.

Anil Ravipudi
Kalyan Ram
Pathas
Tollywood
  • Loading...

More Telugu News