pavan kalyan: పవన్ సరసన ఛాన్స్ కొట్టేసిన ప్రగ్యా జైస్వాల్?

  • 'కంచె' సినిమాతో మంచి క్రేజ్ 
  • చివరిసారిగా చేసిన చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'
  • త్వరలోనే సెట్స్ పైకి  

ఒక వైపున రాజకీయాలలో చురుకైన పాత్రను పోషిస్తూనే మరో వైపున సినిమాలు చేయాలనే నిర్ణయానికి పవన్ కల్యాణ్ వచ్చేశాడు. ఇప్పటికే ఆయన కథానాయకుడిగా 'పింక్' రీమేక్ మొదలైంది. 'దిల్' రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక మరో వైపున క్రిష్ దర్శకత్వంలోని సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో పవన్ వున్నాడు.

ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. చారిత్రక నేపథ్యంతో కూడిన ఒక ఎమోషనల్ పాయింట్ ను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో పవన్ 'దొంగ' పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. పవన్ సరసన కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో 'కంచె' సినిమాతో ఆమె మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆమె చివరిగా చేసిన చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'.

pavan kalyan
Pragya Jaiswal
  • Loading...

More Telugu News