Mekapati Goutham Reddy: ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి అదనపు శాఖల కేటాయింపు

  • ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యం, జౌళి, ఐటీ శాఖల మంత్రిగా ఉన్న గౌతంరెడ్డి
  • అదనంగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖల కేటాయింపు
  • సీఎంకు కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, జౌళి, ఐటీ శాఖల మంత్రిగా వున్న ఆయనకు అదనంగా  నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు చేసింది. విషయం తెలిసిన మంత్రి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగన్‌ను కలిశారు. తనపై నమ్మకంతో అదనపు శాఖలు కేటాయించిన ముఖ్యమంత్రికి గౌతంరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.  

Mekapati Goutham Reddy
JAGAN
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News