Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • సినిమాలు తగ్గిపోవడంపై కాజల్ 
  • 'సరిలేరు నీ కెవ్వరు'కి మరో కామెడీ ఎపిసోడ్ 
  • అనుష్క 'నిశ్శబ్దం'కి కొత్త రిలీజ్ డేట్  

 *  ఒకప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొంది ప్రస్తుతం తెలుగులో అవకాశాలు పొందలేకపోతున్న కాజల్ అగర్వాల్ అందుకు కారణాన్ని తాజాగా వివరించింది. 'ఇప్పుడు నేను మెచ్యుర్డ్ ఆర్టిస్టుని.. ఏది వస్తే అది ఒప్పేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అలా ఎడాపెడా చేసేయాలన్న తొందర, ఆశ కూడా నాకు లేవు. అందుకే సెలెక్టివ్ గా చేస్తున్నాను' అంటూ కవరింగ్ ఇచ్చుకుంది.
*  సంక్రాంతికి విడుదలైన మహేశ్ బాబు చిత్రం 'సరిలేరు నీ కెవ్వరు' బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడీ చిత్రానికి మరో కామెడీ సన్నివేశాన్ని జతకలుపుతున్నారు. మహేశ్ బాబు, రావు రమేశ్ కుటుంబాలపై సాగే ఈ ట్రైన్ ఎపిసోడ్ ప్రేక్షకులను మరింతగా రంజింపజేస్తుందని భావిస్తున్నారు. నేటి నుంచి అన్ని థియేటర్లలోనూ ఈ కొత్త ఎపిసోడ్ ను ప్రదర్శిస్తారు.
*  అనుష్క నటించిన 'నిశ్శబ్దం' చిత్రానికి కొత్త విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 31న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసిన సంగతి విదితమే. ఇప్పుడు వచ్చే నెల 20న విడుదల చేయడానికి నిర్మాతలు తాజాగా నిర్ణయించినట్టు సమాచారం.   

  • Error fetching data: Network response was not ok

More Telugu News