Basket locusts: మిడతల బుట్టతో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రాజస్థాన్ ఎమ్మెల్యే బీహారీలాల్!

  • మిడతల దాడులతో పంటలకు అపార నష్టం వాటిల్లింది
  • రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్
  • ప్రభుత్వం దృష్టిని ఆకర్షించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం 

మిడతల దండు పంటలపై పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ.. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాజస్థాన్ కు చెందిన బీజేపీ శాసన సభ్యుడు బీహారీలాల్ నోఖా విమర్శించారు. ఇటీవల పాకిస్థాన్ లోని ఎడారి ప్రాంతం నుంచి మిడతలు పెద్ద ఎత్తున రాజస్థాన్ లోకి వచ్చి భారీ ఎత్తున పంటను ధ్వంసం చేశాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.  

ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించేందుకు ఆయన మిడతలతో కూడిన గంపను నెత్తిన పెట్టుకుని ఏకంగా అసెంబ్లీలోకి ప్రవేశించారు. అనంతరం మిడతల దాడుల కారణంగా రైతులకు జరుగుతున్న పంట నష్టాన్ని సభలో ఆయన వివరించారు. రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Basket locusts
Rajasthan
Assemly
BJP
MLA
Bihari lal Nokha
  • Loading...

More Telugu News