Janasena: జనసేన-బీజేపీ లాంగ్ మార్చ్ తో వైసీపీ పునాదులు కదులుతాయి: జనసేన నేత పోతిన మహేశ్

  • రాజధాని తరలింపుకు కేంద్రం వ్యతిరేకం
  • వైసీపీ నేతల మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దు
  • అవాస్తవాలను ప్రచారం చేస్తే కోర్టు కీడుస్తాం

అమరావతి నుంచి రాజధాని తరలింపును కేంద్రం సమర్థించడం లేదని జనసేన నేత పోతిన మహేశ్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ నేతల మోసపూరిత ప్రకటనలను ఎవరూ నమ్మవద్దన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అమోదం లేదన్నారు.

రాజధాని అమరావతి కోసం జనసేన-బీజేపీ చేసే లాంగ్ మార్చ్ లో వైసీపీ పునాదులు కదులుతాయన్నారు. తమ కూటమిది రైతు పక్షం అయితే.. వైసీపీది పెట్టుబడిదారుల పక్షమని ఆరోపించారు. విశాఖలో భూములు, ఫామ్ హౌస్ పాలన కోసమే రాజధానిని తరలించాలని సీఎం భావిస్తున్నారన్నారు. అవాస్తవాలను ప్రచారం చేస్తే కోర్టుకీడుస్తామన్నారు.

Janasena
BJP
Potina Mahesh
Amaravati
Andhra Pradesh
  • Loading...

More Telugu News