Bajaj: యువతను ఆకట్టుకునే బైక్ కోసం ట్రయంఫ్ తో చేతులు కలిపిన బజాజ్
- 200-800 సీసీ శ్రేణిలో బైకుల తయారీ
- 2022 నాటికి మార్కెట్లోకి బైకు
- ట్రయంఫ్ బ్రాండ్ పైనే అమ్మకాలు
బ్రిటన్ కు చెందిన దిగ్గజ ద్విచక్ర వాహన తయారీదారు ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ తో బజాజ్ ఆటో చేతులు కలిపింది. భారత్ లో మధ్య శ్రేణి బైక్ తయారీ కోసం కృషి చేయాలని ఇరువర్గాలు నిర్ణయించుకున్నాయి. రూ.2 లక్షల కంటే తక్కువ ధరలో లభ్యమయ్యే ఈ నూతన తరం బైక్ ను మరో రెండేళ్లలో భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు.
ప్రధానంగా 200-800 సీసీ బైకుల తయారీపై బజాజ్, ట్రయంఫ్ దృష్టి సారిస్తున్నాయి. యువత మెచ్చే అన్ని అంశాలు తాము రూపొందించబోయే బైకులో ఉంటాయని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ సీఈఓ నిక్ బ్లూర్ వెల్లడించారు. కాగా, రెండు సంస్థల భాగస్వామ్యంతో తయారయ్యే బైకులను ట్రయంఫ్ బ్రాండ్ పైనే విక్రయించనున్నారు. దేశీయంగా తయారయ్యే ఈ బైకులను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.