Mouni Amavasya: పవిత్ర వారణాసికి తండోపతండాలుగా భక్తుల రాక
- సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్య మంచిదని భక్తుల నమ్మిక
- దీనికి మౌని అమావాస్యగా మరోపేరు
- పితృతర్పణలకు అనువైన రోజు కావడంతో పోటెత్తిన భక్తులు
సంక్రాంతి తర్వాత వచ్చే 'పుష్యమాస అమావాస్య' ఎంతో మంచిరోజు అని హిందువులు విశ్వసిస్తారు. ఆ రోజున తమ పెద్దవారికి పితృ తర్పణలు సమర్పించడం, నదీ స్నానాలు చేస్తే మంచిదని నమ్ముతారు. పైగా 'పుష్యమాస అమావాస్య' నాడు మౌనవ్రతం పాటించడం వల్ల పుణ్యం వస్తుందని భావిస్తారు. అందుకే ఈ అమావాస్యను 'మౌని అమావాస్య' అని కూడా పిలుస్తారు. ఈ 'మౌని అమవాస్య' సందర్భంగా వారణాసిలోని పవిత్ర గంగానదికి భక్తులు వేల సంఖ్యలో వస్తున్నారు. భారీగా తరలివస్తున్న భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు చేసి, ఆచార సంప్రదాయల ప్రకారం పూజాదికాలు నిర్వహిస్తున్నారు.