Telugudesam: ఏపీ ప్రభుత్వంపై టీ-టీడీపీ నేతల విమర్శలు
- వైసీపీకి అధికారం ఇచ్చినందుకు ప్రజలు బాధ పడుతున్నారు
- ఏపీ ప్రభుత్వం తీరు మారాలి
- లేకపోతే ప్రజల నమ్మకాన్ని కోల్పోతారు
ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఏపీలో వైసీపీకి ఎందుకు అధికారం ఇచ్చామా అని ప్రజలు బాధపడేలా అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎల్. రమణ విమర్శించారు. ప్రభుత్వం ఇకపై కూడా ఇదే మాదిరి వ్యవహస్తే భవిష్యత్ లో ప్రజల నమ్మకాన్ని వైసీపీ కోల్పోవడం ఖాయమని అన్నారు. గతంలో శాసనమండలిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేశారని, ఇప్పుడు దానిని రద్దు చేసే ఆలోచనలో జగన్ ఉన్నారని ధ్వజమెత్తారు. రావుల చంద్రశేఖర్ మాట్లాడుతూ, శాసనమండలి చైర్మన్ ను మంత్రులు దూషించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో మంత్రుల ప్రవర్తన పరాకాష్ఠకు చేరిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.