Nirbhaya Case: మళ్లీ కోర్టుకు నిర్భయ దోషులు.. రేపు విచారణ

  • క్యురేటివ్.. పిటిషన్లు దాఖలుకు అవకాశం రాలేదన్న దోషులు పవన్,అక్షయ్
  • జైలు అధికారులు పత్రాలు ఇవ్వడంలో జాప్యం చేశారని పిటిషన్ 
  • రెండో సారి డెత్ వారెంట్ అమలు ఫిబ్రవరి 1న..

పటియాలా హౌస్ కోర్టు రెండోసారి జారీచేసిన డెత్ వారెంట్ ను తప్పించుకోవడానికి నిర్భయ దోషులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఇప్పటికే మొదటి డెత్ వారెంట్ జారీ చేయగా.. దానిపై దోషులు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేస్తూ.. సమయం గడిచిపోయేలా చేశారు. దీంతో కోర్టు తాజాగా రెండోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. దీని ప్రకారం దోషులకు ఫిబ్రవరి 1న ఉరి శిక్ష అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని కూడా తప్పించుకునేందుకు దోషులు పవన్, అక్షయ్ ప్రయత్నాలు ప్రారంభించారు.

వీరిద్దరి తరపున న్యాయవాది ఏపీ సింగ్ ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఇద్దరు దోషులు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేసేందుకు అవసరమైన పత్రాలను ఇవ్వడంలో తీహార్ జైలు అధికారులు జాప్యం చేశారని న్యాయవాది పిటిషన్లో ఆరోపించారు. ఈ కారణంగా వారు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునేందుకు ఆలస్యమైందని పేర్కొన్నారు. కాగా, వీరి పిటిషన్ పై రేపు కోర్టు విచారణ జరుపనుంది. ఇప్పటివరకు వీరిద్దరూ క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకోలేదు. నలుగురు దోషుల్లో మరో దోషి ముకేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే.

Nirbhaya Case
Death Penality
Pavan Guptha
Curative Petition
New Delhi
  • Loading...

More Telugu News