Lakshmi narayana: బీజేపీతో ‘జనసేన’ పొత్తు శుభసూచకం: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా
  • రాజధాని మార్పుపై న్యాయస్థానం తేలుస్తుంది
  • ప్రభుత్వం నియమనిబంధనలను పాటించాలి

బీజేపీతో జనసేన పార్టీ కుదుర్చుకున్న పొత్తుపై ఆ పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం శుభసూచకంగా అభివర్ణించారు. ఈ విషయమై తమ అధినేత పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టు చెప్పారు. రాజధాని మార్పు అంశంపై  న్యాయస్థానం తన తీర్పు ద్వారా తేలుస్తుందని అన్నారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలని, మండలి రద్దుపై ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, నియమనిబంధనలను అనుసరించాలని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు.  

Lakshmi narayana
Janasena
BJP
Pawan Kalyan
AP Capital
  • Loading...

More Telugu News