Andhra Pradesh: నిన్న ఏ2 ముద్దాయి పబ్లిగ్గా దొరికిపోయాడు: దేవినేని ఉమ

  • విజయసాయిపై ఉమ ధ్వజం
  • 30 కోట్లు ఇచ్చానని విజయసాయి చెప్పినట్టు వార్తలొచ్చాయన్న ఉమ
  • ఇలాంటి వాళ్లు ఉండాల్సింది జైల్లోనే అంటూ వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసనమండలి సమావేశాల సందర్భంగా ఏ2 ముద్దాయి పబ్లిగ్గా దొరికిపోయాడంటూ వ్యాఖ్యానించారు.

బొత్సా, నీవల్ల నాకు 30 కోట్లు నష్టం... నీలాంటి చేతకాని మంత్రులను నమ్ముకుని రూ.30 కోట్లు ఇచ్చానంటూ విజయసాయిరెడ్డి అన్నట్టుగా వార్తలొచ్చాయని ఉమ ఆరోపించారు. ఆ 30 కోట్లు ఏంటో, ఎవరికిచ్చాడో అవన్నీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో చెప్పుకుంటాడని అన్నారు. ఇలాంటి వ్యక్తులు ప్రజా జీవితంలో ఉండకూడదని, ఇలాంటి వాళ్లు ఉండాల్సింది జైల్లోనే అని వ్యాఖ్యానించారు. అందుకే విజయసాయి బెయిల్ రద్దు చేయాలంటూ తాము పిటిషన్ వేస్తామని ఉమ తెలిపారు.

Andhra Pradesh
Amaravati
AP Capital
Devineni Uma
Vijay Sai Reddy
Telugudesam
YSRCP
Jagan
CBI Court
  • Loading...

More Telugu News