Chandrababu: తీర్మానం లేకుండా మండలి రద్దుపై చర్చ రాజ్యాంగ విరుద్ధం : చంద్రబాబు
- రాజధాని అంశం ఇప్పుడు కోర్టు, సెలెక్ట్ కమిటీ పరిధిలో ఉంది
- దీనిపై అసెంబ్లీలో ఎలా చర్చిస్తారు?
- మండలిని రద్దు చేస్తామంటే బెదిరిపోయేవారెవరూ లేరిక్కడ
మండలి రద్దుపై ఎటువంటి తీర్మానం చేయకుండా అసెంబ్లీలో దానిపై ఎలా చర్చిస్తారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈరోజు ఉదయం చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలి రద్దు అంశం జగన్ ప్రభుత్వం మరో అనాలోచిత నిర్ణయమన్నారు. అయినా మండలిని రద్దు చేస్తామనగానే బెదిరిపోయేవారెవరూ ఇక్కడ లేరన్నారు. ప్రస్తుతం రాజధాని అంశం సెలెక్ట్ కమిటీ, కోర్టు పరిధిలో ఉందని, ఈ పరిస్థితుల్లో దానిపై అసెంబ్లీలో ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. కౌన్సిల్ చైర్మన్ ప్రసంగానికి వక్రభాష్యాలు అంటగడుతున్నారని, చట్టాలను తుంగలో తొక్కుతారా? అని చంద్రబాబు ధ్వజమెత్తారు.