Rajiv Gandhi International Airport: నిఘా నడుమ శంషాబాద్ విమానాశ్రయం

  • రిపబ్లిక్ డే ఉత్సవాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత 
  • క్షుణ్ణంగా తనిఖీ చేశాకే వాహనాలకు అనుమతి 
  • అనుమానితుల వివరాలపై ఆరా

రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఉగ్రమూకలు చెలరేగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అణువణువూ తనిఖీ చేస్తున్నారు. వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతిస్తున్నారు. సందర్శకులకు పాస్ ల జారీని నిలిపివేశారు. ప్రయాణికులు కూడా తప్పనిసరిగా తగిన గుర్తింపు పత్రాలతో రావాలని భద్రతా అధికారులు సూచించారు. ఈనెల 31వ తేదీ వరకు విమానాశ్రయంపై నిఘా నేత్రం కొనసాగుతుందని, అప్పటి వరకు సందర్శకులకు పాస్ లు కూడా ఇచ్చేది లేదని అధికారులు తెలిపారు.

Rajiv Gandhi International Airport
Hyderabad
  • Loading...

More Telugu News