Budda Venkanna: సంతలో పశువుల్లా ఇద్దరు ఎమ్మెల్సీలను కొన్నారు: వైసీపీపై బుద్ధా వెంకన్న ఫైర్

  • విజయసాయిపై బుద్ధా వ్యాఖ్యలు
  • మండలిలోనే ఉండి చేసిన చెత్త పనులు సరిపోవా అంటూ ఆగ్రహం
  • శ్రీరంగనీతులు చెబుతున్నారంటూ విమర్శలు

వైసీపీ సర్కారు పెద్దలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. రెండు రోజుల పాటు శాసనమండలిలోనే ఉండి, చేసిన చెత్తపనులు సరిపోనట్టు శ్రీరంగనీతులు చెబుతావా విజయసాయిరెడ్డీ? అంటూ బుద్ధా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసం రాజధానిని విభజించాలని చూస్తున్నారని, తోడుదొంగలను రంగంలోకి దింపి ఎమ్మెల్సీలను కొనాలని చూశారని విమర్శించారు. చివరికి సంతలో పశువుల్లా ఇద్దరు ఎమ్మెల్సీలను కొన్నారని వ్యాఖ్యానించారు. మండలి సిబ్బందిని కూడా మేనేజ్ చేసి వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని తామిచ్చిన నోటీసును పక్కనబెట్టించి నాటకాలు ఆడారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. మండలి చైర్మన్ మీ దొంగ పనులు గమనించి ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తే రౌడీల్లా ఆయనపై పడ్డారని మండిపడ్డారు.

Budda Venkanna
Telugudesam
YSRCP
AP Legislative Council
Amaravati
  • Loading...

More Telugu News