train no.17215 17216: 26 నుంచి ధర్మవరం - విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ రైలు రూటు మారుతోంది

  • ప్రస్తుతం గుత్తి, ఎర్రగుంట్ల, నంద్యాల మీదుగా ప్రయాణం
  • పది రోజుల పాటు కడప, రేణిగుంట, గూడూరు మీదుగా
  • నాన్‌ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌ పనులు జరుగుతుండడమే కారణం

విజయవాడ-ధర్మవరం మధ్య తిరుగుతున్న17215, 17216 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పది రోజులపాటు దారిమళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఎర్రగుంట్ల, నంద్యాల, గుంటూరు డివిజన్లలో నాన్‌ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌ పనులు నిర్వహిస్తుండడంతో ఈ మార్పు అనివార్యమైంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

ఈ నెల 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు 17216 నంబరు రైలు ధర్మవరం గుత్తి, ఎర్రగుంట్ల, నంద్యాల మీదుగా విజయవాడ వెళ్లడానికి బదులు ధర్మవరం, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట, గూడూరు మీదుగా విజయవాడకు వెళ్తుందని అధికారులు ప్రకటించారు.

అలాగే ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 4 వరకు విజయవాడ నుంచి ధర్మవరం వెళ్లే  17215 నంబరు రైలు కూడా విజయవాడ, గూడూరు, రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి మీదుగా ధర్మవరం వెళ్తుంది. రైలుని దారిమళ్లిస్తున్నప్పటికీ  మధ్యలో వచ్చే రైల్వేస్టేషన్లలో ఈ రైలు ఆగకపోవచ్చని తెలుస్తోంది.

train no.17215 17216
route diversion
26th onwards
  • Loading...

More Telugu News