Vijay Sai Reddy: ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడంలో భాగంగా అప్పట్లో యనమలని స్పీకర్ గా చేశాడు: చంద్రబాబుపై విజయసాయి విమర్శలు

  • ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి
  • చంద్రబాబు, యనమల లక్ష్యంగా వ్యాఖ్యలు
  • మండలి ప్రతిష్ఠను మంటగలిపాడని బాబుపై ఆగ్రహం

శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు విషయంలో ఎదురైన చేదు అనుభవం వైసీపీ నేతలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఘాటుగా విమర్శిస్తున్నారు. తాజాగా, వైసీపీ ఎంపీ ట్విట్టర్ లో చంద్రబాబు, యనమల రామకృష్ణుడులపై స్పందించారు.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచే ప్రణాళికలో భాగంగా అప్పట్లో యనమలని చంద్రబాబు స్పీకర్ గా తెరపైకి తీసుకొచ్చాడని, అటు యనమల కూడా తన బాస్ ముఖ్యమంత్రి కావడానికి స్పీకర్ స్థానంలో ఉండి సహకరించాడని ఆరోపించారు. అంతేకాకుండా బాబు చరిత్రలో నిల్చేంతగా సేవ చేశారని విమర్శించారు. ఇప్పుడు శాసనమండలి ప్రతిష్ఠను కూడా చంద్రబాబు తన స్వార్థం కోసం మంటగలిపారని మండిపడ్డారు.

Vijay Sai Reddy
YSRCP
Telugudesam
Chandrababu
Yanamala
AP Capital
Andhra Pradesh
Amaravati
  • Loading...

More Telugu News